TTD BOARD MEMBER LARGESSE _ శ్రీవారి ఆలయ నిర్మాణానికి 4 ఎకరాల భూమి, రూ 3.16 కోట్ల విరాళం

Tirumala, 6 February 2021: TTD has received 4 acres land and ₹3.16 crore funds towards the construction of Sri Venkateswara temple at Ulandurupeta in Tamilnadu, both which were donated by TTD Trust Board member Sri Kumaraguru.

He handed over the cheques and land documents to the TTD Chairman Sri YV Subba Reddy at a function held in Gubba Choultry on Saturday.

Speaking on the occasion the TTD Board Chief said on the directions of AP Chief Minister Sri YS Jaganmohan Reddy, TTD has launched Hindu Sanatana Dharma propagation from Kashmir to Kanyakumari.

As part of the program the TTD will soon lay a foundation for building Sri Venkateswara Swamy temple at Jammu also.

He said in order to provide Srivari Darshan to devotees to the people of his constituency; the Legislator of Udamalapeta and TTD Board member Sri Kumaraguru had donated 4 acres of land worth ₹20 crore. He has already donated a crore and also offered to give whatever the expenditure towards the construction of the temple.

TTD Chairman said the foundation stone laying ceremony will soon be performed after selecting a good muhurtam.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ నిర్మాణానికి 4 ఎకరాల భూమి, రూ 3.16 కోట్ల విరాళం

తిరుమల 6 ఫిబ్రవరి 2021: తమిళనాడు రాష్ట్రం ఉలుందుర్పేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ సభ్యులు శ్రీ కుమారగురు 4 ఎకరాల స్థలం, నిర్మాణ ఖర్చులకు రూ 3.16 కోట్లు చెక్కులు శనివారం విరాళంగా అందించారు. తిరుమల గుబ్బ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి వీటిని అందించారు. ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలు, రూ 3.16 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కులను శ్రీ కుమారగురు అందజేశారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ధర్మ ప్రచారం : చైర్మన్

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ధర్మ ప్రచారం చేస్తున్నామన్నారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో శ్రీవారి ఆలయానికి శంఖుస్థాపన చేస్తామన్నారు. శ్రీ కుమారగురు తన నియోజకవర్గ ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడానికి రూ 20 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఆలయ నిర్మాణానికి గతంలో కోటి విరాళం ఇచ్చారనీ, ప్రస్తుతం ఇచ్చిన చెక్కులతో కలిపి రూ 3 కోట్ల 16 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. ఆలయ నిర్మాణానికి ఖర్చయ్యే మిగిలిన మొత్తం కూడా శ్రీ కుమార గురు విరాళంగా అందిస్తామని చెప్పడం సంతోషమని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది