CVSO AND TIRUPATI URBAN SP INSPECTS MADA STREETS _ శ్రీవారి ఆలయ మాఢ వీధుల్లో సివిఎస్వో, అర్బన్ ఎస్పీ పరిశీలన
TIRUMALA, 26 JULY 2022: As the ensuing annual brahmotsavams in Tirumala temple are scheduled between September 27 to October 5, TTD CVSO Sri Narasimha Kishore along with Tirupati Urban SP Sri Parameshwar Reddy inspected the four Mada streets in Tirumala on Tuesday.
Later speaking to media persons in Tirumala, the TTD top cop said, with the management taking a decision to perform Vahana Sevas along the four Mada streets this year after a gap of two years due to Covid pandemic, a heavy influx of pilgrims is being anticipated for the nine-day annual festival.
During this preliminary inspection, all the vital places have been inspected to ensure there will be no parking problem. Many more inspections are to take place in the coming days to make sure that there are no traffic issues during the upcoming mega-religious fete.
SE 2 Sri Jagadeeshwar Reddy, EE Sri Jaganmohan Reddy, ASP Tirumala Sri Muniramaiah, VGO Sri Bali Reddy, other TTD officials and Tirumala police were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
శ్రీవారి ఆలయ మాఢ వీధుల్లో సివిఎస్వో, అర్బన్ ఎస్పీ పరిశీలన
తిరుమల, 2022 జులై 26: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంగళవారం టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు.
అనంతరం సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తొలి విడతగా పరిశీలన చేపట్టామని, మరిన్ని సార్లు పరిశీలన చేపట్టి కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు.
టిటిడి ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇఇ శ్రీ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య, విజిఓ శ్రీ బాలిరెడ్డి, తదితర తిరుమలలోని టీటీడీ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.