CHAIRMAN, EO EXTEND SANKRANTI GREETINGS _ శ్రీవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆనందం పండాలి_ – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
Tirupati, 14 Jan. 22: TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy extended Sankranti greetings to devotees, employees and Srivari sevaks.
They sought the blessings of Sri Venkateswara Swamy to save all from the Pandemic Corona and provide relief to the entire humanity.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆనందం పండాలి
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
తిరుపతి 13 జనవరి 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆనందం పండాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు వారు శుక్రవారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ ప్రగతికి పట్టు గొమ్మలైన పల్లె సీమల్లో సంక్రాంతిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు. వ్యవసాయానికి, పశు పోషణకు మనం ఇచ్చే గౌరవానికి సంక్రాంతి ప్రతీక అని శ్రీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కరోన విపత్కర పరిస్థితుల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజాలను కాపాడాలని వారు కోరారు.
ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుని పండుగ జరుపుకోవాలని చైర్మన్, ఈవో విజ్ఞప్తి చేశారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది