PERFECT PLANNING BY ALL DEPARTMENTS RESULTED IN STUPENDOUS SUCCESS OF ANNUAL BRAHMOTSAVAMS-EO _ శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన టిటిడి తిరుమల అదనపు ఈవో, అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
TTD ADMINISTRATIVE CHIEF COMPLIMENTS ADDNL.EO, OTHER OFFICIALS
Tirupati, 14 Oct. 19: The perfect planning coupled with dedicated efforts by all departments resulted in the incident free and successful completion of annual brahmotsavams at Tirumala, said TTD EO Sri Anil Kumar Singhal.
While complimenting the Additional EO Sri AV Dharma Reddy and his team of officials who did a fantastic job in achieving the best results during the recently completed annual brahmotsavams during the senior officers meeting held at the meeting hall in TTD Administrative Building in Tirupati on Monday, the EO said, keeping in view the past experiences, the Vigilance Wing has made elaborate arrangements for luggage deposition and parking facility for the pilgrims during this year brahmotsavams which won the appreciation of denizens”, he observed.
The EO instructed the Engineering Wing officials to search for alternate measures to provide a protective shield to the pilgrims sitting in galleries from inclement weather conditions. “In spite of heavy downpour on Garuda Seva day, the devotees sitting in galleries have not moved an inch. We should provide them some cover from bad weather conditions. For the upcoming most important event of Vaikuntha Ekadasi on January 6 next, the departments should gear up with plans from now itself”, he added.
He also complimented the cultural troupes which represented from 18 states of the country for the first time, which stood as a special attraction during the whole annual brahmotsavams. The EO directed the concerned officer to give a pen drive of their art form along with a letter of appreciation to all the teams, as a token gesture.
The EO instructed the Electrical Wing to go for alternate arrangements in the place of wooden logs for erecting giant electrical cutouts to avoid any untoward incidents. “Instead go for some advanced way of electrical decoration which is risk-free and more attractive”, he added.
Later he directed the JEO Sri P Basant Kumar to conduct regular video conferences with the In-charges of TTD Kalyana Mandapams, Information Centres across the country to address problems if any.
CE Sri Ramachandra Reddy, FACAO Sri Balaji and other senior officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన టిటిడి తిరుమల అదనపు ఈవో, అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
అక్టోబర్ 14, తిరుపతి, 2019: శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమిష్టిగా కృషి చేసిన టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, అధికారులు, సిబ్బందికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతం స్ఫూర్తితో, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న వైకుంఠం ఏకాదశికి పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలలో 18 రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాబృందాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని అభినందించారు. కళాబృందాలకు టిటిడి నుండి అభినందనల ఉత్తరాలు, ఆయా కళాబృందాలు వారి కళాప్రదర్శనలను తిలకించేలా పెన్ డ్రైవ్ ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు మెరుగైన ప్రదర్శన ఇచ్చే కళాబృందాలను 6 నెలలు ముందుగానే ఎంపిక చేసేలా ఓ స్పష్టమైన విధానం రూపొందించాలన్నారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా లగేజీ నిర్వహణ చేపట్టారన్నారు. గరుడ సేవ రోజున ఓ వైపు వర్షం వస్తున్నా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు విరివిగా పంపిణీ చేశారన్నారు. వర్షానికి ఇబ్బంది లేకుండా గరుడసేవను తిలకించేలా షెల్టర్స్ ను ఏర్పాటు చేయాలని భక్తులు కోరారని, అందుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రథసప్తమి తరహాలో వచ్చే బ్రహ్మోత్సవాల గరుడసేవ రోజున ఉదయం నుండి భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో మరింత పరిశుభ్రతను పెంచేందుకు హెర్బల్ ఉత్పత్తులను ఉపయోగించాలని ఆదేశించారు.
విద్యుత్ అలంకరణలకు సంబంధించి భారీ స్థాయిలో కొయ్యలతో రూపొందించే తాత్కాలిక కటౌట్ల స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. భక్తులను మరింత ఆకట్టుకునేలా సప్తగిరి మాసపత్రికను తీర్చిదిద్దాలని, అందులోభాగంగా కథనాలు ఆకర్షణీయంగా ఉండేలా నిపుణులను ఆహ్వానించాలన్నారు. వివిధ ప్రాంతాలలోని టిటిడి కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల అధికారులతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఎఫ్ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.