EXTENSIVE ARRANGEMENTS FOR VAIKUNTADWARA DARSHANAM- EO _ శ్రీ‌వారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృత ఏర్పాట్లు – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirumala, 18 December 2023: TTD EO Sri AV Dharma Reddy said that TTD is making extensive arrangements for providing Srivari Vaikuntadwara Darshan to as many devotees as possible from December 23 to January 1.

Addressing the media conference after a review meeting with all heads of TTD departments at the Annamaiah Bhavan in Tirumala on Monday evening, the EO said the Vaikuntadwara Darshan commences from early hours of December 23 at 1.45 am and will conclude at the midnight of January 1. 

He briefed the media on arrangements…

•  With an objective to reduce the waiting time of devotees in queue lines  TTD will issue 4,23,500 Sarva Darshan offline tokens from December 22 afternoon 2pm in all  92 counters at 9 locations in Tirupati.

•  The token issuing locations are: Vishnu Nivasam, Srinivasam, Govindarajaswami Choultries, Bhudevi Complex, Ramachandra Pushkarani, Indira Maidan, Jeevakona High School, Raman  Naidu High School in Bairagipettada and ZP school in  MR Palli.

•  Special queue lines, barricades, drinking water, coffee, tea, snacks will be provided at these counters.

•  QR code boards will be displayed at all these counters for the benefit of devotees.

•  With the coordination of district authorities, traffic and civil police security arrangements were also made.

•  Since limited rooms available in Tirumala, devotees shall book rooms in Tirupati itself during these festive days.

•  Only devotees with tickets or tokens will be allotted rooms.

•  As in past break Darshan facility is provided to protocol VIPs in person in limited numbers only. During these ten days no recommendation letters for break Darshan will be accepted.

•  Devotees with tokens and tickets alone shall be allowed for Srivari Vaikuntadwara Darshan at Tirumala 24 hours ahead only.

•  Devotees without tokens could reach Tirumala but can not get Darshan. They can visit other places in Tirumala viz. Papavinasanam, Akasa Ganga etc.

•  Devotees with tokens or tickets should come for Srivari Darshan at a specified date and time only.

•  Devotees should plan Tirumala only after ascertaining the availability of tokens through SVBC channel and TTD website.

Special programs 

•  Sri Malayappa Swami and His consorts will ride Swarna ratham on Mada streets on Vaikunta Ekadasi day  between 9am and 11am.

•  On Vaikunta Dwadasi day on December 24, Chakra Snanam will be organised between 4.30am and 5.30 am.

•  On Vaikunta Ekadasi day Vishnu Sahasranama Parayanams will be observed at the Nada Neeranjanam platform between 6am and 7am and on the same day being Gita Jayanti, Bhagavad Gita Akhanda Parayanam will also be recited between 12noon and 4pm.

Puranic significance of Vaikunta Dwara Darshan 

•  As per Puranic legend one day duration in Vaikunta of Sri Maha Vishnu is considered as one year on the Earth. Similarly, the 12 hours of daytime in Vaikunta is 6 months in earth also termed as Uttarayana and 12 hours of nightfall in Vaikunta is six months of Dakshinayana on Earth.

•  Likewise 120 minutes in Vaikunta is 30 days on the Earth known as Dhanur Masa. In that one day He provides darshan to all the deities for 40 minutes which is equal to 10 days of Vaikunthadwara Darshanam on the Earth.

The devotees should note that all these ten days are equally important.

Darshan on any 10 days is Divine- Sri Venugopala Dikshitulu

Speaking on the occasion one of the Pradhana archakas of Srivari temple Sri Venugopala Dikshitulu highlighted the significance of Vaikuntadwara Darshan and said Srivari Darshan on any one of these ten days earns the same outcome of bliss to the devotees.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, one of the chief priests of Srivari temple Sri Govindaraja Dikshitulu, SVBC CEO Sri Shanmugha Kumar, CAuO Sri Shailendra, SE-2 Sri Jagadeeshwar Reddy and Temple Dyeo Sri Lokanatham were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృత ఏర్పాట్లు – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం

– శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు

తిరుమల, 2023 డిసెంబరు 18: వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం క‌ల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతు‌తో సమావేశం నిర్వహించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. అదేవిధంగా ఇతర వివరాలను ఈవో తెలియజేశారు.

– తిరుమ‌లలోని క్యూలైన్ల‌లో ఎక్కువ సేపు వేచి ఉండ‌కుండా శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి వీలుగా డిసెంబ‌రు 22వ‌తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్త‌య్యేంత వ‌ర‌కు మొత్తం 4,23,500 స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు మంజూరు చేస్తాం.

– తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్క‌రిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, భైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ ప‌ల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో ఉచితంగా స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు పొంద‌వ‌చ్చు.

– డిసెంబ‌రు 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి టోకెన్లు రద్దు చేయడమైనది.

– దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వ‌దినాల‌లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

– గ‌తంలో వ‌లెనే ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ విఐపిల‌కు, కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఇవ్వ‌బ‌డుతుంది. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.

– వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఫ‌లితం 10 రోజ‌లు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇత‌ర భ‌క్తులు ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

– టోకెన్లు, టికెట్లు పొందిన భ‌క్తుల‌ను 24 గంటలు ముందు మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తిస్తారు.

– టోకెన్లు లేని భ‌క్తులు తిరుమ‌ల‌కు రావచ్చు. కానీ ద‌ర్శ‌నం ఉండ‌దు. వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

– ద‌ర్శ‌న టోకెన్లు పొందిన భ‌క్తులు త‌మ టోకెన్ల‌పై సూచించిన తేదీ, స‌మ‌యానికే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రావాల‌ని విజ్ఞ‌ప్తి.

– దూరప్రాంతాల్లో ఉన్న భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇత‌ర మాధ్య‌మాల ద్వారా టోకెన్ల ల‌భ్య‌త తెలుసుకున్న త‌రువాతే తిరుమ‌ల ప్ర‌యాణం ఖ‌రారు చేసుకోగ‌ల‌రు.

ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు

– వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

– వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.

– నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం ఉంటుంది. అదేరోజు గీతాజయంతి రావడంతో భగవద్గీత అఖండపారాయణం కూడా నిర్వహిస్తాం.

పౌరాణిక వైశిష్ట్యం

– పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం విశిష్ట‌త ఇలా ఉంది. దేవ‌లోకంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం.

– దేవ‌లోకంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది దేవ‌లోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.

– ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాలలో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం. కాబ‌ట్టి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఈ 10 రోజుల‌లో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ స‌మాన‌మే. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌నానికి రావాల్సిందిగా విజ్ఞ‌ప్తి.

10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం : శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను తెలియజేశారు. 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం ఉంటుందని వెల్లడించారు.

ఈ సమావేశంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ గోవిందరాజ దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఎఓ శ్రీ శేషశైలేంద్ర, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.