GOLDEN WAIST ORNAMENT DONATED _ శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి కానుక‌గా రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం

Srinivasa Mangapuram, 19 Mar. 20: Visakhapatnam based devotees Sri N Kalidas and Dr Bhanumati, the Executive Director and Managing Director respectively of the Eco Carbon Private Limited Company donated a Golden Waist Ornament to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Thursday.

The Jewel weighed around one kilo worth about 45lakhs.

DyEO of the temple Sri Yellappa, Chief Priest Sri Balaji Rangacharyulu, Superintendent Sri Ramanaiah and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి కానుక‌గా రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం

తిరుప‌తి, 19 మార్చి 2020: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యానికి గురువారం ఒక కిలో బ‌రువు గ‌ల రూ.45 ల‌క్ష‌లు విలువైన బంగారు వ‌డ్డాణం కానుక‌గా అందింది.

విశాఖ‌ప‌ట్నంకు చెందిన ఎకో కార్బ‌న్ ప్ర‌యివేట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ ఎన్‌.కాళిదాస్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.భానుమ‌తి దాస్ ఈ మేర‌కు విరాళాన్ని అందించారు. శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూల‌మూర్తికి ఈ వ‌డ్డాణాన్ని అలంక‌రిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.