VANABHOJANAM HELD IN EKANTAM _ శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం

TIRUPATI, DECEMBER 11: The annual Karthika Vanabhojanam in Srinivasa Mangapuram held in Ekantam following Covid restrictions on Friday.

Usually every year, the processional deities were paraded to the Paruveta Mandapam located near Srivari Mettu and Vanabhojanam was observed.

But this year, due to prevailing Covid situation, the deities were taken to Kalyana Mandapam located inside temple and Snapana Tirumanjanam is performed.

Deputy EO Smt Shanti, AEO Sri Dhananjeyulu, Superintendent Sri Chengalrayalu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 11: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.