CHANDRAGIRI MLA PRESENTS SARE TO KALYANA VENKANNA _ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి సారె సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
Srinivasa Mangapuram, 18 Feb. 20: Chandragiri MLA and TTD Trust Board member Dr Chevireddy Bhaskar Reddy presented Sate to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivas Mangapuram on Tuesday on the occasion of Garuda seva in the evening.
Earlier the silk Saree and puja material were brought in a ceremonious procession with mangala vaidyams after special puja at the Tummalagunta temple of Sri Venkateswara Swamy.
Speaking to media later Dr.Bhaskar Reddy said his presentation of sare was a set tradition during all annual Brahmotsavams of Srinivasa Mangapuram.
Earlier he was received by the JEO Sri P Basant Kumar at the temple. DyEO Sri Yellappa, AEO Dhananjayudu, superintendent Sri Chengalrayulu, chief archaka Sri Balaji Rangacharyulu, inspector Sri Anil Kumar also participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి సారె సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి, 2020 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి మంగళవారం మధ్యాహ్నం టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మన్, ప్రభుత్వ విప్ అయిన డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సారె సమర్పించారు. ముందుగా తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను మేళతాళాల మధ్య ఊరేగింపుగా శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించారు.
ఈ సందర్భంగా డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్నడా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ప్రధాన అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.