శ్రీ‌వాణి ట్ర‌స్టు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టుల‌పై ఈవో స‌మీక్ష‌

శ్రీ‌వాణి ట్ర‌స్టు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టుల‌పై ఈవో స‌మీక్ష‌
 
తిరుప‌తి, 2020 జనవరి 27: అనంత‌రం టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ‌వాణి ట్ర‌స్టు, ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు కార్య‌క‌లాపాల‌పై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు ప‌రిధిలో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో స్విమ్స్‌, బ‌ర్డ్ ఆసుప‌త్రుల్లో జ‌రిగిన వైద్య‌చికిత్స‌ల వివ‌రాల‌ను ఈవో అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రోగుల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యాలు అందించాల‌ని సూచించారు. అనంత‌రం శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పూర్త‌యిన ఆల‌యాలు, ఇంకా నిర్మాణం చేప‌ట్టాల్సిన ఆల‌యాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ స‌మావేశాల్లో టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామ‌చంద్రారెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఒ.బాలాజి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.