OVERALL DEVELOPMENT OF VISAKHA WITH SRIVARI DIVYAKSHETRAM-SWAMI SWARUPANANDA _ శ్రీ‌వారి ఆల‌యంతో విశాఖ స‌ర్వ‌తోముఖాభివృద్ధి – శ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి

SRIVARI TEMPLES FROM KASHMIR TO KANYAKUMARI-TTD CHAIRMAN

 

SPIRITUAL EUPHORIA ENHANCED IN VISAKHA-MINISTER

 

TIRUPATI, 23 MARCH 2022: The Maha Kumbhabhishekam to the newly constructed Srivari temple in Visakhapatnam was held with religious ecstasy on Wednesday which was graced by the Pontiff of Visakha Sarada Peetham HH Sri Swarupananda Saraswathi Swamy.

 

During his Anugraha Bhashanam on the auspicious occasion, the Pontiff said, as per the wish of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, the massive temple of Sri Venkateswara Swamy was built at Visakhapatnam under the stewardship of TTD Chairman Sri YV Subba Reddy. The Seer lauded the efforts of TTD in constructing the temple following all the norms of Vaikhanasa Agama. Describing the importance of Dhwajastambha, Artha Mandapam, Mukha Mandapam, Garbhalayam, Mula Virat, he said the very darshan of the presiding deity will waive off all sins of the people and help the humanity from evil forces.

 

Later, TTD Chairman Sri YV Subba Reddy said, to enhance the spiritual aesthetics of Visakhapatnam, TTD mulled the construction of the Srivari temple a couple of years ago with Rs.26crores. The five-day fete commenced with Ankurarpanam on March 18. He said as part of the propagation of Hindu Sanatana Dharma, TTD is committed to construct Srivari temples from Kashmir to Kanyakumari. The temple in Orissa is set for opening in another two months and very soon the temple in Amaravati will be opened. The Srivari temple is coming up in 60acres land at Jammu and would be completed in another six-month time”, he added.

 

Minister Sri Avanti Srinivas said, the day is rewritten in golden letter in the history of Visakhapatnam with the opening of Srivari temple with the back drop of beach. With the benign blessings of Sri Venkateswara Swamy, the city will develop further in the country, he aspired.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి, 2022 మార్చి 23: శ్రీ‌వారి ఆల‌యంతో విశాఖ స‌ర్వ‌తోముఖాభివృద్ధి – శ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి

కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు – టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి

విశాఖ‌కు మ‌రింత ఆధ్యాత్మిక శోభ – మంత్రి శ్రీ అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా విశాఖ శ్రీ‌ స్వరూపానందేంద్ర‌ సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు, టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం విశాఖలో నిర్మించినట్లు తెలిపారు. వైఖానస ఆగమానుసారం శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న తిరిగి వచ్చాడా అన్నంత‌ అద్భుతంగా ఉందన్నారు.
వేదాలు ఆగమాలు దేవాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని చెప్పారు. ధ్వజస్తంభం సమస్త జీవులకు, ఆలయానికి వెన్నుముక్క వంటిద‌న్నారు. ముఖమండపం స్థూలశరీరం, అర్ధ మండపం సూక్ష్మ శరీరం, గర్భాలయం హృదయం వంటిదన్నారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని వివరించారు.

విశాఖ శారదా పీఠం లోకంలోని సమస్త జీవులు సుభిక్షంగా ఉండాలని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు పనిచేస్తోందన్నారు. శ్రీ వారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిల్లలకు విద్యాబుద్ధులు, పెద్ద ప‌రిశ్ర‌మ‌లు రావడం ద్వారా యువత ఉపాధి అవ‌కాశాలతో ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అనంత‌రం టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖ‌కు మ‌రింత ఆధ్యాత్మిక శోభ క‌ల్పించేందుకు రెండు సంవ‌త్స‌రాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. మార్చి 18వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఒరిస్సాలో శ్రీవారి ఆలయం పూర్తయిందని, రాబోయే రెండు నెలల్లో ఆలయం ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం పూర్తిచేసి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాశ్మీర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మ‌త్స‌కార‌, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్ళలో 1000 శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.

రాష్ట్ర మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ‌వ‌ల‌సిన రోజ‌న్నారు. తిరుమల నుండి స్వామివారు మ‌నంద‌రినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారన్నారు. విష్ణుమూర్తికి సముద్రం అంటే ఇష్టమని, విశాఖ సముద్రతీరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. శ్రీ వారి అనుగ్రహంతో విశాఖ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.