ANNUAL VASANTHOTSAVAM BEGINS AT SRIVARI TEMPLE _ శ్రీ‌వారి ఆల‌యంలో వసంతోత్సవాలు ప్రారంభం

VASANTHOTSAVAM PERFORME SINCE DAYS OF VIJAYANAGARA KING ACHYUTARAYA- TTD EO

SARVA BHOOPALA VAHANAM ON APRIL 6, SAYS CHIEF PRIEST SRI VENUGOPAL DIKSHITULU

Tirumala, 5 Apr. 20: As part of the Agama traditions, the three-day annual vasanthotsavam festival commenced on Sunday in Tirumala.

TTD Executive Officer Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy participated in the holy event conducted at the Kalyana mandapam inside the Srivari temple in view of ongoing lockdown due to corona virus in the country.

VASANTHOTSAVAM AT SRIVARI TEMPLE SINCE ACHUTARAYA PERIOD

Speaking on the occasion, TTD EO Sri Anil Kumar Singhal said that the holy event is being observed in Srivari temple since the days of Vijayanagar king sri Achytaraya during Chaitra Suddha Pournami day every year for three days.

He said in view of Corona virus lockdown, this year the event will be held inside the temple in Ekantam for three days. On the first two days Vasantotsavam will be performed for the utsava idols of Sri Malayappaswamy and His consorts Sridevi and Bhudevi while on third day the utsava idols of Sri Sita Rama Lakshmana, Anjaneya and Rukmini Sameta Sri Krishna Swamy will also join.

He said the event is being telecasted live by SVBC for the sake of global devotees.

SARVA BHOOPALA VAHANAM ON APRIL 6:

The Srivari temple chief priest Sri Venugopal Dikshitulu said on the second day of Vasantotsavam on April 6, the deities will be seated on divine Sarva Bhoopala vahanam which will be held inside the temple only but the traditional Swarna Ratham event has been cancelled by the TTD in view of Covid-19 restrictions.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Sri Sri Sri Chinna Jeeyar Swamy, CVSO Sri Gopinath Jatti, Srivari Temple Dyeo Sri Harindranath, VSO Sri Manohar and other officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో వసంతోత్సవాలు ప్రారంభం

అచ్యుత‌రాయ‌ల కాలం నుండి వ‌సంతోత్స‌వాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ఏప్రిల్ 6న స‌ర్వ‌భూపాల వాహ‌నం : ప‌్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు

ఏప్రిల్ 05, తిరుమల, 2020: తిరుమలలోని శ్రీ‌వారి ఆల‌యంలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ప్ర‌తి ఏడాదీ ఆల‌య స‌మీపంలోని వ‌సంత మండ‌పంలో ఈ ఉత్స‌వాలు జ‌రిగేవి. క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల్లో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

అచ్యుత‌రాయ‌ల కాలం నుండి వ‌సంతోత్స‌వాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ విజ‌య‌న‌గ‌ర రాజైన శ్రీ అచ్యుత‌రాయ‌లు వ‌సంతోత్స‌వాల‌ను ప్రారంభించిన‌ట్టు చ‌రిత్ర ద్వారా తెలుస్తోంద‌న్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌ని తెలిపారు. క‌రోనా వ్యాధి నేప‌థ్యంలో ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు. మొద‌టి రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు వ‌సంతోత్స‌వం జ‌రుగుతుంద‌ని తెలియ‌జేశారు. ఈ ఉత్స‌వాల‌ను భ‌క్తులంద‌రూ ద‌ర్శించే విధంగా ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తున్నామ‌ని తెలిపారు.

ఏప్రిల్ 6న స‌ర్వ‌భూపాల వాహ‌నం : ప‌్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు

శ్రీ‌వారి ఆల‌య ప‌్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ వసంతోత్స‌వంలో రెండో రోజైన సోమ‌వారం ఉద‌యం 8.30 నుండి 9 గంట‌ల మ‌ధ్య ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని కొలువుదీర్చుతామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా హార‌తులు, నైవేద్యం స‌మ‌ర్పిస్తామ‌ని వివ‌రించారు. సాధార‌ణంగా వ‌సంతోత్స‌వాల్లో రెండో రోజు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం ఉంటుందని, క‌రోనా వ్యాధి కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింద‌ని చెప్పారు.

కాగా, మొద‌టిరోజు ఆదివారం ఉద‌యం 5.30 నుండి 6 గంట‌ల మ‌ధ్య మొదటి గంట నైవేద్యం, 6 నుండి 7 గంట‌ల మ‌ధ్య రెండో గంట నైవేద్యం నిర్వ‌హించామ‌ని, ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని స‌న్నిధి నుండి క‌ల్యాణ మండపానికి వేంచేపు చేశామ‌ని తెలిపారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వ‌హించామ‌ని, ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం చేప‌ట్టామ‌ని చెప్పారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టామ‌ని, అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించామ‌ని వివ‌రించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నార‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.