PADI SARE REACHES TIRUCHANOOR _ శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
Tirumala, 1 Dec. 19: The Padi Sare is a gift to Goddess Padmavathi from Lord Venkateswara from Tirumala and reaches Tiruchanoor on Sunday.
The procession of Sare took place in Tirumala between 4:30am to 5:30am and later a team of officers accompanied by proceed er to Tiruchanoor.
Later the sare consisting of Turmeric, vermilion, pattu sari, Prasadams etc. which was carried on a temple elephant was collected at Pasupu Mandapam and from there carried to Panchami Theertha Mandapam.
TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Haridranath and others took part.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సారె
డిసెంబరు 1, తిరుమల 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువుగల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్ని శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుండి కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా పద్మపుష్కరిణి వద్ద అమ్మవారికి సారె సమర్పించారు.
ఆభరణంతో కూడిన శ్రీవారి సారెను అలిపిరి వద్ద అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌కు అందజేశారు. పసుపు మండపం వద్ద ఈవోకు తిరుపతి జెఈవో అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ లోకనాథం, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.