GRAND CONCLUSION OF BALALAYAM SAMPORKSHANAM AT ALIPERI PADALA MANDAPAM _ శ్రీవారి పాదాలమండపంలో ఘనంగా ముగిసిన ”బాలాలయ సంప్రోక్షణ”
Tirupati, 26 Feb. 20: The three day ritual of Holy Balalaya samprokshanam of Sri Lakshmi Narayana temple, Sri Andal Ammavari temple, Sri Perialwar temple and Sri Bhaktanjaneya temple at Alipiri Padala mandapam concluded with Purnahuti on Wednesday morning.
As part of the ritual Punya havachanam and kumbha Avahanam were performed in the morning during Mesha lagnam of Phalguna Sudha Tadiya and there after sarva darshan commenced at 11.30 am.
The Padala mandapam complex at Alipiri hosted Sri Lakshmi Narayana temple, Sri Andal Ammavari temple, Sri Perialwar temple and Sri Bhaktanjaneya temples acts as the gateway to walkers toot path.
Special Grade DyEO of Sri Govindaraja Swamy temple Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy, TTD Vaikhanasa advisor Sri NK Sundara Varadan, Chief archaka of Padala mandapam temples Sri Muralikrishna, inspector Sri Srinivasulu and others participated
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి పాదాలమండపంలో ఘనంగా ముగిసిన ”బాలాలయ సంప్రోక్షణ”
తిరుపతి, 2020 ఫిబ్రవరి 26: తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పెరియాళ్వార్, శ్రీ భక్తాంజనేయస్వామివారి చిత్రపట్టాలకు బాలాలయ సంప్రోక్షణ బుధవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది.
ఇందులో బాగంగా ఉదయం 7.30 గంటలకు పుణ్యాహవచనం, ఉదయం 10.27 నుండి 10.59 గంటల నడుమ ఫాల్గుణ శుద్ధ తదియ మేష లగ్నంలో బాలాలయ చిత్రపటాలకు కుంభ ఆవాహన నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
శ్రీవారి పాదాల మండపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ పెరియాళ్వార్ ఆలయం, శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయాలకు మరమ్మత్తులు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈఓ శ్రీ రవికుమార్‌రెడ్డి, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ ఎన్ఎకె.సుందరవరదన్, పాదాల మండపం ఆలయాల ప్రధానార్చకులు శ్రీ మురళీకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.