CREATE SPIRITUAL AND FRIENDLY ENVIRONMENT FOR SRIVARI DEVOTEES- ADDITIONAL EO TO TIRUMALA SHOP OWNERS _ శ్రీవారి భక్తులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 26 Feb. 20: As Tirumala is revered as the spiritual capital for all Hindus present across the world, the local traders and shop keepers of Tirumala should maintain friendly and be cordial in their gesture towards multitude of visiting pilgrims and enhance image of holy precincts said TTD Additional Executive Officer Sri AV Dharma Reddy.
He was addressing a review meeting with the local traders, shopkeepers and bank officials at the Asthana Mandapam in Tirumala and urged them to be a part in building up eco-friendly environs in Hill town to which the local shop owners also extended their support to TTD in it’s pilgrim initiatives.
The Additional EO said devotees are contributing crores worth coins to Srivari hundi. TTD is contemplating to hand over coins to traders in form of packets of Rs.500, Rs.200,Rs.100 and Rs50 which can be given to devotees by traders. Very soon this system will be implemented by TTD in all places where cash transactions takes place.
The additional EO advised traders to follow the TTD guidelines and not to violated licence rules of TTD.
Contending that TTD had banned use of plastic covers in Tirumala, he said the traders should gradually stop using them. Soon even the use of laddu covers would also be banned and as an alternate either jute or cotton bags would replace laddu covers in future, he observed.
He said in March TTD officials would conduct survey of all shops for streamlining the system. He appealed to shopkeepers to cooperate with TTD administration by not selling banned or prohibited items in their outlets.
TTD DyEO for Revenue and Panchayat Sri Vijaysaradhi, AEO Revenue Sri Ramaraju, several bank officials and local traders participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి భక్తులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
ఫిబ్రవరి 26, తిరుమల, 2020: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలను ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారని, ఇంతటి విశిష్టమైన ప్రదేశానికి విచ్చేస్తున్న శ్రీవారి భక్తులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్థానిక దుకాణదారులను కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం పలు బ్యాంకుల అధికారులు, దుకాణదారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. టిటిడి చేసిన పలు సూచనలను స్థానిక వ్యాపారులు స్వాగతించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు తృప్తిగా తిరిగి వెళ్లేలా అందరూ సహకరించాలని కోరారు. భక్తుల పట్ల దుకాణదారుల ప్రవర్తన మంచిగా ఉండాలని, అధిక ధరలకు విక్రయించరాదని సూచించారు. శ్రీవారి హుండీ ద్వారా నెలకు సుమారు రూ.5 కోట్ల నాణేలు కానుకగా అందుతున్నాయని, వీటిని ఆయా బ్యాంకులకు అప్పగిస్తున్నామని తెలిపారు. బ్యాంకుల నుండి వ్యాపారులు ఈ నాణేలను తీసుకుని చిల్లరగా భక్తులకు అందించాలని కోరారు. స్వామివారి హుండీ నాణేలు కావడంతో భక్తులు సంతోషంగా స్వీకరిస్తారని చెప్పారు. ఇందుకోసం రూ.500/-, రూ.200/-, రూ.100/-, రూ.50/- ప్యాకెట్ల రూపంలో నాణేలను అందిస్తామన్నారు. టిటిడి వద్ద నగదు లావాదేవీలు జరిగే అన్ని ప్రదేశాల్లోనూ ఈ నాణేలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
టిటిడి నియమ నిబంధనలను దుకాణదారులు తప్పక పాటించాలని, నిర్ణీత స్థలాన్ని అతిక్రమించరాదని అదనపు ఈవో సూచించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను నిషేధించామని, దుకాణదారులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని అరికట్టాలని కోరారు. త్వరలో లడ్డూ కవర్లను కూడా నిషేధిస్తామని, ప్రత్యామ్నాయంగా జ్యూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా రాగి, స్టీల్, టెట్రాప్యాక్ బాటిళ్లను భక్తులకు విక్రయించాలని కోరారు. తిరుమలలో 150 వాటర్ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని, వీటిపై భక్తులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇటీవల లండన్ నిపుణులు తిరుమలలో తాగునీటి నాణ్యతను పరీక్షించి ప్రపంచస్థాయి నాణ్యత ప్రమాణాలు ఉన్నాయని ధ్రువీకరించారని తెలిపారు.
దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు లైసెన్సు ఫీజును నిర్ణీత కాలంలో చెల్లించాలని, ఇందుకోసం బ్యాంకులో గానీ, ఆన్‌లైన్‌లో గానీ చెల్లించాలని సూచించారు. అన్ని దుకాణాల్లో బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్, బయో మెడికల్ వ్యర్థాలను వేరువేరుగా సేకరించేందుకు మూడు డస్ట్‌బిన్లను వినియోగించాలన్నారు. తిరుమలలో నిషేధిత వస్తువులను విక్రయించరాదని, ఇందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. మార్చి నుండి అన్ని దుకాణాలను సర్వే చేసి పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో టిటిడి రెవెన్యూ మరియు పంచాయతి డెప్యూటి ఈవో శ్రీ ఎల్.విజయసారథి, ఏఈవో శ్రీ రామరాజు, పలు బ్యాంకుల అధికారులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.