శ్రీవారి సన్నిధిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతం – సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు
శ్రీవారి సన్నిధిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతం – సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు
తిరుపతి, 2021 నవంబరు 30: శ్రీవారి సన్నిధిలో సుదీర్ఘ కాలం పని చేయడం పూర్వజన్మ సుకృతమని టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు అన్నారు. టిటిడిలోని వివిద విభాగాల్లో పని చేస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన 10 మందికి పరిపాలన భవనం ఆవరణంలోని సమావేశం హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడిచేలా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు అందించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ఇంతటి గౌరవ సన్మాన కార్యక్రమం నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకున్నటిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం వీరందరికీ శాలువాలు కప్పి సన్మానించారు. తరువాత వీరందరికీ కుటుంబసభ్యులతో సహా అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎఫ్ ఏ సిఏవో శ్రీ రవి ప్రసాదుతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ చేసింది వీరే
శ్రీమతి జమునా రాణి ( లెక్చరర్), శ్రీమతి మీనాకుమారి ( లెక్చరర్), డా.నిరిష ( లెక్చరర్), శ్రీ నాగభూషణం ( సీనియర్ అసిస్టెంట్), శ్రీమతి యల్లమ్మ ( దఫెదార్), శ్రీ నాగరాజు నాయుడు (ఒఎస్వో), శ్రీ ప్రభాకర్ (మజ్దూర్), శ్రీ కోదండరామయ్య (మజ్దూర్), శ్రీ గోవిందరాజన్ ( పోటు కార్మికులు).
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది