TIRUMALA PEDDA JEEYAR SWAMY PRAYS LORD VENKATESWARA ON HIS TIRUNAKSHATRAM _ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారికి పెద్దమర్యాద
Tirumala, 31 Dec. 20: The Pontiff of Tirumala, Sri Sri Sri Periya Koil Kelvi Appan Shatagopa Ramanuja Pedda Jeeyar Swamy had the benign blessings of Lord Venkateswara in Tirumala temple on the occasion of his 71st Tirunakshatram on Thursday.
The senior pontiff was ceremonially brought from Banyan tree near Old Annadanam building to Bedi Anjaneya temple and after darshan and Shatari was taken to Srivari temple amidst Mangala Vaidyam for Srivari Darshan.
It may be mentioned here that, the Tirumala Pedda Jiyar Mutt was set up by exponent of Visishta Advaita philosophy by Bhagavad Ramanujacharya. All the daily Kaikaryas, utsavas, rituals and religious practices at the Srivari temple is being supervised by the Pedda Jiyar Swamiji only.
TTD Trust Board Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohanacharyulu and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారికి పెద్దమర్యాద
తిరుమల, 2020 డిసెంబరు 31: శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారి 71వ తిరునక్షత్రం సందర్భంగా గురువారం పెద్దమర్యాద జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి ముందుగా తిరుమలలోని పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయించారు.
తిరుమలలో శ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి సేవలందిస్తున్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్‌స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.