SRI ANDAL NEERATOTSAVAM AT SRI GT _ శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ప్రారంభం
Tirupati, 08 January 2024: The seven day long Sri Andal Neeratotsavam commenced at Sri Govindaraja Swami temple on Sunday.
As part of the festivities, the Utsava idol of Sri Andal Ammavaru will be paraded on Mada streets,Chinna bazar veedhi,Sri Kodandaramaswami Mada street and the Nirala Mandapam on the banks of Sri Ramachandra Pushkarini. The legend says the festivities signifies the penance about Sri Venkateswara by Sri Andal.
After Abhishekam and Asthanam, Sri Andal will return to Sri Govindaraja Swamy temple in the same route. Similar festivities will continue till January 13 as well.
Temple Dyeo Smt Shanti, AEO Sri Muni Krishna Reddy , superintendents Sri Narayana,Sri Mohan,temple inspector Sri Radhakrishna,Sri Dhananjay were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 07 జనవరి 2024: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనుంజయ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.