DHARMASASTHA SWAMY HOMAM HELD AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం
Tirupati, November 14, 2026: Sri Dharmasastha Swamy Homam was performed with devotion at Sri Kapileswara Temple in Tirupati on Saturday as part of the month-long Karthika Masa Homa Mahotsavams.
Special pujas, homam and Maha Purnahuti were performed from 9 am to 12 noon.
Navagraha Homam on November 15
Sri Navagraha Homam will be performed on Sunday.
Subramanyeswara Swamy Kalyanam on November 15
The divine Kalyanam of Sri Valli Devasena Sametha Sri Subramanyeswara Swamy will be held at 5.30 pm. Devotees can participate by paying Rs.500. One uttariyam, one blouse piece and annaprasadam will be provided to each couple.
Temple Dy.EO Smt. Nagratna, Superintendent Sri Chandrasekhar, Temple Inspector Sri Damodaram, priests and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం
తిరుపతి, 2026 నవంబరు 14: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష పూజలు, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, స్వామివారికి నివేదన, హారతి నిర్వహించారు.
నవంబరు 15న శ్రీ నవగ్రహ హోమం
హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ నవగ్రహ హోమం నిర్వహించనున్నారు.
నేడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య కల్యాణం
ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
గృహస్తులు రూ.500 చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దామోదరం, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.






