NAVAGRAHA HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

TIRUPATI, 02 NOVEMBER 2022: Navagraha Homam was observed as a part of Karthika Masa Homams in Sri Kapileswara Swamy temple on Wednesday.

From November 3-11 Chandi Yagam will be observed to Sri Kamakshi Ammavaru.

DyEO Sri Devendrababu, AEO Sri Srinivasulu, Superintendent Sri Bhupati and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

 తిరుపతి, 2022 న‌వంబ‌రు 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 3 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది.
 
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్లు శ్రీ భూప‌తి, శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.