శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఉదయం మూలవర్లకు మహాభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 6.00 గంటల నుండి 9.00 గంటల వరకు పంచమూర్తులైన కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నస్వామి,  సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ప్రధాన అర్చకులు శ్రీ స్వామినాధ్‌ గురుకుల్‌, ఉమాశంకర్‌ గురుకుల్‌, మణివాసగురుకుల్‌, చంథ్రేఖర్‌ గురుకుల్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.