KOIL ALWAR TIRUMANJANAM HELD IN KT _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TIRUPATI, 08 FEBRUARY 2023: The temple cleaning fete, Koil Alwar Tirumanjanam was held with religious fervour in Sri Kapileswara Swamy temple in connection with the annual brahmotsavam which commences from February 11 onwards.

This traditional temple cleansing fete was observed between 11:30 am and 2:30am and later devotees are allowed for darshan.

DyEO Sri Devendra Babu, AEO Sri Parthasaradi, Superintendent Sri Bhupati and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 08 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

ఇందులో భాగంగా ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేశారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థ సారధి , సూపరింటెండెంట్ శ్రీ భూపతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.