HOMA MAHOTSAVAMS CONCLUES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

TIRUPATI, 12 DECEMBER 2023: The month-long Homa Mahotsavams concluded on a grand religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday evening.

Earlier in the morning Sri Chandikeswara Swamy Homam was held followed by the sacred procession of Panchamurthies on respective Tiruchis including Sri Vighneswara Swamy, Sri Valli Devasena Sameta Sri Subrahmanya Swamy, Sri Kapileswara Swamy, Sri Kamakshi Devi and Sri Chandikeswara Swamy.

DyEO Sri Devendra Babu and other temple officials, staffs, devotees participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన హోమ మహోత్సవాలు

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 12: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ముగిశాయి. ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల‌స్నానం, అంకుర‌ విసర్జన నిర్వహించారు.

సాయంత్రం లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన చేప‌డ‌తారు. ఆ త‌రువాత పంచమూర్తులను పుర‌వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ర‌వికుమార్‌, శ్రీ బాల‌కృష్ణ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.