RUDRA YAGAM ENDS AT SRI KAPILESWARA TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన రుద్ర‌యాగం

Tirupati,22 November 2022: The Rudra Yagam organised at Sri Kapileswara Swamy temple as part of Homa Mahotsavams concluded on Tuesday morning.

 

The rituals of Rudra Yagam included, Maha Purnahuti, Maha Shanti Abhisekam, Kalasha Udwasana and Kalashabhisekam to Mula idol were grandly performed.

 

TTD also organised the Shiva parvatula kalyanotsavam in the evening. Sri Chandikeswar Swami Homam will be conducted on November 23.

 

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy, Superintendent Sri Bhupathi, temple inspector Sri Balakrishna, temple Archakas and officials were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన రుద్ర‌యాగం

తిరుప‌తి‌, 2022 న‌వంబ‌రు 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) మంగళవారం ఘనంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉధ్వాసన‌, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనుంది.

నవంబరు 23న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.