GANAPATHI HOMAM PERFORMED _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా గణపతి హోమం
Tirupati, 30 Oct. 19: Ganapathi Homam was performed as a part of Karthika Homa Mahotsavams in Kapileswara Swamy temple in Tirupati on Wednesday.
Ganapathi Homam was performed in Yagashala between 9am and 12 noon. The 16 divine names of Lord were chanted while performing Homam.
The Homam will also be observed on Thursday. The devotees can participate by paying Rs. 500 to take part in Homam.
DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా గణపతి హోమం
తిరుపతి, 2019 అక్టోబరు 30: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం గణపతి హోమం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. వినాయకుడికి ప్రీతిపాత్రమైన కుడుములు, నెయ్యి, అన్నం, అటుకులు, బెల్లం, అరటిపండ్లు తదితర అష్టద్రవ్యాలతో హోమం చేపట్టారు. ఇందులో 16 నామాలతో గణపతిని స్తుతించారు.
కాగా సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇవ్వనున్నారు. అక్టోబరు 31వ తేదీ కూడా గణపతి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.