KALABHAIRAVA HOMAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం

Tirupati, 25 Nov. 19: As part of ongoing homa Mahotsavams at Sri Kapileswara temple, Sri Kalabhairaveswara Homam was performed on Monday morning.

Asta Bhairavi Homa, Maha Purnahuti, Kalashabisekam, nivedana and harati was performed from 9.00- 12.00 noons.

Later in the evening the celestial Kalyanam of Lord Shiva and Goddess Parvathi, followed by Chandiswara kalasha sthapana, lather Purnahuti, visesha diparadhana will be performed.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi are supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

 

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 25: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా సోమ‌వారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.

సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శివపార్వతుల దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీ చండికేశ్వరస్వామివారి కలశస్థాపన, లఘు పూర్ణాహుతి, విశేష దీపారాధన నిర్వహిస్తారు.

నవంబరు 26వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.