SRI KALABHAIRAVA HOMAM HELD AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం

Tirupati, 22 Nov. 20: As part of month-long Karthika Homa Mahotsavams at Sri Kapikeswara Swamy temple the Sri Kalabhairava Homam was performed on Sunday morning.

In view of Covid guidelines of state and central governments, the Homa mahotsavam is held in ekantham.

Sri Kalabhairavaswami Homa, Purnahuti, Kalasha Udwasana, Mahashanti Abhisekam and Kalashabhisekam were observed at the temple Yagashala from morning to noon.

In the evening the Kalasha sthapana of Sri Dakshinamurthy Swami and Vivesha Deeparadhana were conducted.

SRI DAKSHINAMURTHY SWAMY HOMA ON NOV 23

As part of Karthika Homa Mahotsavams, TTD will be organising the Sri Dakshinamurthy Swami Homa on November 23 at Sri Kapileswara Swamy temple.

Temple Deputy EO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple inspector Sri Reddy Shekar, temple priests and staffs were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం

తిరుపతి, 2020 న‌వంబ‌రు 22: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి 12 గంటల వరకు శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

న‌వంబ‌రు 23న‌ శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి హోమం

న‌వంబ‌రు 23వ తేదీ సోమ‌‌వారం శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి హోమం జ‌రుగ‌నుంది.  
         
ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.