GRAND FINALE OF RUDRA YAGAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌యాగం

Tirupati,11 December 2023: The 11-day-long Rudra yagam conducted at Sri Kapileswara temple in Tirupati as part of the month-long Homa mahotsavams concluded on Monday.

Later in the evening, the Siva Parvati Kalyanotsavam was held. As part of the Sri Chandikeswara Homam commencing on December 12 the Kalasa sthapana, Kalasa Aradhana and Homa will be performed at night.

EO Sri AV Dharma Reddy JEO Sri Veerabrahmam temple Dyeo Sri Devendrababu, AEO Sri Subbaraju, Superintendents Sri Bhupathi, Sr Assistant Sri Ravi Kumar, Temple inspector Sri Balakrishna,archakas and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌యాగం

తిరుప‌తి‌, 2023 డిసెంబ‌రు 11: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) సోమ‌వారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన‌, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనుంది.

త‌రువాత రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ చండికేశ్వరస్వామివారి క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ ఆరాధ‌న‌, హోమం నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబరు 12న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.