LAKSHA BILVARCHANA HELD IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన
TIRUPATI, 12 NOVEMBER 2022: Laksha Bilvarchana Seva has been performed in Sri Kapileswara Swamy temple in Tirupati on Saturday.
This event took place between 6am and 12noon.
In the evening Sri Chandra Sekhara Swamy utsavamurty was paraded along the mada streets.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన
నవంబరు 12, తిరుపతి, 2022: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.