PARUVETA UTSAVAM HELD _ వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం 

TIRUPATI, 27 JUNE 2023: Paruveta Utsavam was held with utmost gaiety and religious ecstasy near Srivari Mettu Paruveta Mandapam in Srinivasa Mangapuram on Tuesday.

As part of it Mock Hunt was enacted by the temple staff and priests in the presence of Sri Kalyana Venkateswara.

Later Annaprasadam was served to devotees.

Special GrDyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Temple Archaka Sri Balaji Swamy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం

తిరుపతి, 2023 జూన్ 27: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు .

ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.