KRT BTU WALL POSTERS RELEASED _ శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

TIRUPATI, 04 MARCH 2023: As the annual Brahmotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati are set to commence from March 20-28, the JEO TTD Sri Veerabrahmam released the posters and booklets for the same on Saturday.

 

The event took place in his chamber in TTD Administrative Building.

 

Sri KRT DyEO Smt Nagaratna, Archaka Sri Anandakumar Deekshitulu, PRO Dr T Ravi, Superintendent Sri Ramesh and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

తిరుపతి, 2023, మార్చి 04: తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆలయంలో మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు జరుగనున్న వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల వాల్ పోస్టర్లు , బుక్ లెట్లను టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం శనివారం తమ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఆలయంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 19న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

అదేవిధంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, పిఆర్ఓ డా. టి.రవి, ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ, అర్చకులు శ్రీ ఆనందకుమార దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.