KALYNOTSAVAM HELD _ శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 23 April 2024: The celestial wedding ceremony Sri Sita Rama Kalyana was held in Chandragiri Ramalayam with devotion.

The event started with various hymns rendered as per the tenets of Agama Satra.

This celestial marriage was witnessed by devotees in the evening from 6pm to 7:30pm.

DyEO Sri Devendra Babu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2024 ఏప్రిల్ 23: చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం చేశారు. ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

అనంత‌రం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, విజీవో శ్రీ బాలి రెడ్డి, సూప‌రింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ హరిబాబు,
ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.