ADHYAYANOTSAVAM FETE BEGINS AT SRI GT _ శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

Tirupati, 10 January 2024:  TTD commences Adhyayanotsavams in Sri Govindaraja Swamy temple on Wednesday in Tirupati and will last till February 2.

 

The prominent feature of the fete is Divya Prabanda Parayanams in the presence of utsava idols of Sri Govindaraja Swamy and His consorts holding Asthanam at the Kalyana Mandapam between 7pm and 8pm. As part of the celebrations, the traditional festivities of Chinna Sattumora on January 20, Pranaya Kalahotsavam on January 26 and Pedda Sattumora on January 30 will also be held.

 

Both the Pontiffs of Tirumala, Temple DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy and superintendents Sri Narayana, Sri Mohan, temple inspectors Sri Radhakrishna, Sri Dhananjaya were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 10 జనవరి 2024: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం అధ్యయనోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.

ప్ర‌తి ఏడాదీ ఆలయంలో అధ్య‌య‌నోత్స‌వాల సంద‌ర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉద‌యం ఆల‌యంలో సేవాకాలం నిర్వ‌హించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జ‌న‌వ‌రి 20న చిన్నశాత్తుమొర, జ‌న‌వ‌రి 26న ప్రణయ కలహోత్సవం, జ‌న‌వ‌రి 30న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనుంజయ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.