BHOGI THERU HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగితేరు
Tirupati, 14 January 2024: In connection with the Sankranti festivities, Bhogi Teru was held on Sunday at Sri Govindaraja Swamy temple in Tirupati.
On January 14, on the day of the Bhogi festival, between 5.30 pm to 7 pm, a procession of Sri Andal Ammavaru and Sri Krishna Swamy was carried out.
Temple officials were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగితేరు
తిరుపతి, 2024 జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మొదటి రోజు ఆదివారం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భోగితేరు ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 6.30 గంటలకు ఆలయం నుండి చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా కపిలతీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ చక్రస్నానం అనంతరం ఆస్థానం చేపడతారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనుంజయ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.