SRI TATHAYAGUNTA GANGAMMA’S SRIVARI SARE _ శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి సారె

Tirupati, 18 May 2024: On Saturday evening Srivari Temple Deputy EO Sri Lokanatham presented silks to Tataiahgunta Gangamma temple in a procession from Sri Govindarajaswamy temple, a procession went to Sri Gangamma temple.

It is said that Tatayagunta Gangamma was the sister of Tirumala Sri Venkateswara Swamy. It is a tradition to present a saree to Gangamma’s from Srivari temple during the festival every year.

Sri Govindarajaswamy Temple Deputy EO Smt Santi, Gangamma Temple EO Smt. Mamata, Parupatedar Sri Umamaheswar Reddy and others participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి సారె

తిరుపతి, 2024 మే 18: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సారె పంపారు. శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ గంగమ్మ గుడికి వెళ్ళి సారె అందజేశారు.

తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారు. జాతర సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, గంగమ్మ ఆలయ ఈవో శ్రీమతి మమత, పారుపత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.