TALLAPAKA ANNAMACHARYA VARDHANTI POSTERS RELEASED _ శ్రీ తాళ్లపాక అన్నమయ్య 520వ వర్ధంతి కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ
TIRUPATI, 15 MARCH 2023: The 520th Death Anniversary of Telugu Padakavita Piatamaha Sri Tallapaka Annamacharya will be observed in Tirupati, Tirumala, Tallapaka from March 18 to March 21.
TTD EO Sri AV Dharma Reddy on Wednesday released the related posters at his chambers in TTD Administrative Building
JEO for Health and Education Smt Sada Bhargavi, FACAO Sri Balaji, Dharmic Projects Program Officer Sri Rajagopal Rao, Annamacharya Project Director Dr Vibhishana Sharma were present.
On March 18 in Tirumala, Saptagiri Sankeertana Gosthi Ganam has been organised at Narayanagiri Gardens.
While at Mahati and Annamacharya Kalamandiram in Tirupati also special programs have been arranged matching the occasion on the above said days.
In Tallapaka, the birthplace of the saint poet, Annamacharya Sankeertans and Harikatha are being arranged at Dhyana Mandiram and 108-feet statue of Annamacharya.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ తాళ్లపాక అన్నమయ్య 520వ వర్ధంతి కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ
– మార్చి 18 నుండి 21వ తేదీ వరకు తిరుపతి, తిరుమల, తాళ్లపాకలో కార్యక్రమాలు
తిరుపతి, 15 మార్చి 2023: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 520వ వర్ధంతి కార్యక్రమాల పోస్టర్లను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధవారం తిరుపతిపరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 18 నుండి 21వ తేదీ వరకు తిరుమల, తిరుపతితోపాటు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజీ, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాలరావు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. విభీషణశర్మ పాల్గొన్నారు.
తిరుమలలో….
మార్చి 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ కళాకారులతో ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు.
తిరుపతిలో….
మార్చి 17న అలిపిరిలో మెట్లోత్సవం
తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 17వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.
అన్నమాచార్య కళామందిరంలో…
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మార్చి 18న సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహిస్తారు. మార్చి 19 నుండి 21వ తేదీ వరకు సాహితీ సదస్సులు, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
మహతి ఆడిటోరియంలో…
మహతి ఆడిటోరియంలో మార్చి 18 నుండి 21వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొంటారు.
తాళ్లపాకలో …
మార్చి 18 నుండి 21వ తేదీ వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు సంగీతం, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.