DyCM PRESENTS SILKS _ శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి పట్టువస్త్రాల సమర్పణ

TIRUPATI, 10 NOVEMBER 2023: The Honourable DyCM of AP Sri Narayana Swamy presented silk vastrams to Tiruchanoor temple on  Friday.

 

It is tradition to offer Pattu saree to the presiding deity of Sri Padmavathi Devi on the occasion of annual brahmotsavams on behalf of the State Government.

 

JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి పట్టువస్త్రాల సమర్పణ

తిరుప‌తి, 2023 నవంబర్ 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఉప ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో  శ్రీ రమేష్, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.