PAVITRA SAMARPANA HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
TIRUPATI, 08 SEPTEMBER 2022: On the second day of the ongoing annual Pavitrotsavams in Tiruchanoor, Pavitra Samarpana was held.
Pavita malas were decorated to the main deity, utsava deity, deities of sub-temples, Parivara deities, Dhwajasthambham.
In the evening Vaidika rituals will be held in Yagashala.
Temple DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, Agama Advisor Sri Srinivas, Archaka Sri Babu Swamy, Superintendent Sri Seshagiri, Temple Inspector Sri Damodaram were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2022, సెప్టెంబర్ 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాస్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దామోదరం తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.