PUSHPANJALI PERFORMED TO PURANDHARA DASA STATUE _ శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
Tirupati, 11 Feb. 21: Floral tributes were paid to the statue of Sri Purandharadasa located at Alipiri in Tirupati on Thursday on the occasion of 174th Aradhana Mahotsavams of the great Kannada Saint Poet.
At Annamacharya Kalamandiram, Hardasa Ranjani programme was held by the Bhajana Mandali members of Dasa Sahitya Project of TTD.
The Project Special Officer Sri PR Anandatheerthacharya supervising the arrangements of this three-day fete both at Tirumala and in Tirupati.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2020 ఫిబ్రవరి 11: దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 6.00 గంటలకు అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి పుష్పాంజలి ఘటించారు.
హరిదాస రంజని :
అన్నమాచార్య కళామందింలో దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలోని భజనమండళ్ల సభ్యుల హరిదాస రంజని కార్యక్రమం గురువారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో దాససాహిత్య కళాకారులతో సామూహిక సంకీర్తన, ప్రముఖ పండితులతో ధార్మిక ఉపన్యాసాలు, పురందరదాస సంకీర్తన – విభావరి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.