JEO INSPECTS TIRUCHANOOR WORKS _ శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు – జెఈవో శ్రీమతి సదా భార్గవి
Tirupati, 24 March 2021: TTD JEO Smt Sada Bhargavi on Wednesday inspected the development works of Sri Padmavati temple, Tiruchanoor and made valuable suggestions.
Inspecting the development works at Tiruchanoor today the TTD JEO instructed the officials to complete road widening & Parking works at Tiruchanoor on a fast track for the benefit of devotees visiting Goddess Sri Padmavati temple.
She also enquired about hurdles in road widening work at Ghantasala circle and the parking facility near the Panchayat office.
She suggested officials to club Pudi Road-Tollu Garden- a national highway in the road widening program and also to examine the widening of the area on the exit route of Sri Padmavati temple.
CE Sri Ramesh Reddy, SE Sri Satyanarayana EE Sri Narasimha Murthy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు – జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2021 మార్చి 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు, పార్కింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయం పరిసరాలలోని రోడ్లను జెఈవో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో ఘంటశాల విగ్రహం వద్ద రోడ్డు వెడల్పు చేయడానికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతి కార్యాలయం వద్ద పార్కింగ్ స్థలం పరిశీలించి పలు సూచనలు చేశారు. పూడి రోడ్డు – తోళప్ప గార్డెన్ – నేషనల్ హైవేను కలిపే రోడ్డును వెడల్పు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బయటకు వచ్చే మార్గాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
జెఈవో వెంట సిఇ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఇ శ్రీ సత్యనారాయణ, ఇఇ శ్రీ నరసింహమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది