THE ALLEGATIONS BY RADHAMANOHAR DAS ARE BASELESS-TTD _ శ్రీ రాధామనోహర్ దాస్‌కు ప్రచారం పిచ్చి పట్టుకుంది : టిటిడి
TIRUMALA, 30 AUGUST 2022: Taking serious note on the allegations made by former ISKCON member Sri Radha Manohar Das, TTD termed them as ruthless and baseless.
In a statement on Tuesday, disclosing the facts on the various issues alleged by Radha Manohar Das, TTD urged the devotees not to believe and fall prey to such vested interests.
Over the diversion of temple funds, the TTD said, TTD has already constructed 502 temples of Sri Venkateswara in SC, ST, BC and fishermen colonies to avoid religious conversions with the funds of SRIVANI Trust and is set to construct 1342 more temples in the second phase as part of its Sanatana Hindu Dharma Prachara.
On Udayasthamana Seva tickets, TTD replied, an exclusive Children’s Heart Centre will be set up in the state of Andhra Pradesh. So far 500 lives were saved and the infants were given rebirth. To save the little ones who are the future citizens of India, TTD has decided to construct a Children’s Hospital at Rs.300crores with state of Art medical facilities. As a token of gesture to the philanthropists who contributed Rs.1crore towards the construction of the hospital, TTD has allotted Udayasthamana Seva tickets.
TTD ruled out the allegation that it has increased the price of Arjitha Seva tickets.
It is totally insane that the Government is restricting Hindus not to come to Tirumala and encouraging them for conversions.
Upon his call not to drop offerings in the Hundi, TTD said, every day the details of Hundi Collections are being enclosed in a transparent manner to devotees through media
Brushing aside his baseless allegations, TTD said, in the last couple of years, it has taken up umpteen number of Gosamrakshana activities that included Gudiko Gomata and so far donated cow and a calf to 193 temples.
On Dharma Prachara front, TTD said, when the entire world is crippled with Covid Pandemic, seeking divine intervention to save the entire humanity, TTD has taken up several Paraynams and telecasted live on SVBC that won millions of hearts across the world.
TTD has brought several thousands of people living in backward areas of AP and provided them with Brahmotsava Darshanam as well Vaikuntha Dwara Darshanam.
Very recently, it has organized Venkateswara Vaibhavotsavams in a grand and successful manner at Sri Potti Sriramulu Nellore district from August 16-20 that received an overwhelming response from the locals. Series of other dharmic activities are underway.
When these are the facts and realities, the allegations made by Sri Radha Manohar Das are seriously condemnable and regrettable.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ రాధామనోహర్ దాస్‌కు ప్రచారం పిచ్చి పట్టుకుంది : టిటిడి
తిరుమల, 2022 ఆగస్టు 30: ఇస్కాన్ మాజీ సభ్యుడు శ్రీ రాధామనోహర్ దాస్‌కు ప్రచారం పిచ్చి పట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానంపై అవాస్తవ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మానసిక సమస్యతో బాధపడుతున్నట్టుగా వ్యవహరిస్తున్న ఆయన అర్థరహితమైన ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మానసిక స్థితి సరిగాలేని ఇలాంటి వ్యక్తి మాటలు నమ్మవద్దని టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈయన గత కొంతకాలంగా పనిగట్టుకుని టిటిడిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.
1) దేవాలయాల సొమ్ము అన్యాక్రాంతం అవుతోంది.
జవాబు : ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాల నిర్మాణం జరిగింది. రెండో విడతగా దాదాపు 1342 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి.
– విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతిలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఇటీవల ప్రారంభించి భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతోంది. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించడమైనది. అలాగే చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, చెన్నై ఉలందూరు పేటలో, సీతంపేటలో, రంపచోడవరంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
– ముంబయిలో స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నవీముంబయిలోని ఉల్వే ప్రాంతంలో 10 ఎకరాల భూమిని ఇటీవలే టిటిడికి అప్పగించింది. రేమండ్ కంపెనీ అధినేత శ్రీ గౌతమ్ సింఘానియా రూ.70 కోట్లతో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చారు.
– శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన విరాళాలను ఆలయ నిర్మాణాలకు వ్యయం చేస్తున్నామే గానీ ఎలాంటి దుర్వినియోగం కావడం లేదు.
2) ఇళ్లస్థలాలు ఇస్తున్నారు.
జవాబు : ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇస్తున్నారనే ఆరోపణ అర్ధం లేనిది.
3) చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం ఉదయాస్తమాన సేవా టికెట్లు అమ్ముకున్నారు.
జవాబు :
– చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు గతేడాది ప్రారంభించబడిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటివరకు 500కు పైగా శస్త్రచికిత్సలు ఉచితంగా చేశారు. పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఆసరాగా నిలుస్తోంది.
– చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు భూమిపూజ నిర్వహించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.ఒక కోటి విరాళం అందించిన దాతలకు ప్రోత్సాహకంగా ఉదయాస్తమాన సేవా టికెట్ అందించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.
– వేల మందికి విద్య, వైద్యం అందిస్తున్న టిటిడిపై ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం మంచిదికాదు.
4) ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచారు.
జవాబు : ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచలేదు.
5) హిందువులు తిరుమలకు రాకుండా ప్లాన్ చేసి అన్యమతంలోకి మార్పిడి చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
జవాబు : హిందువులను అన్యమతంలోకి మారుస్తున్నారన్నది నిజం కాదు.
6) హుండీలో డబ్బులు వేయకండి.
జవాబు : హుండీ కానుకలకు సంబంధించి ఎంతో పారదర్శకంగా ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియపరచడం జరుగుతోంది.
7. 1. గోవుల రక్షణ… గుడికో గోవు…. ఎన్ని ఆలయాలకు గోవులిచ్చారు.
– తితిదే గోసంరక్షణార్థం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 193 ఆలయాలకు ఆవు, దూడలను ఉచితంగా అందించడం జరిగింది.
– తిరుపతి స్థానిక ఆలయాల్లో మరియు అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతిరోజు గోపూజ ఘనంగా జరుగుతోంది.
– గోవులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి తిరుపతిలోని గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో రోజువారీ కైంకర్యాల నిమిత్తం అవసరమయ్యే పాల ఉత్పత్తికిగాను దేశీయ మేలుజాతి గోవుల సేకరణ జరుగుతోంది.
– తెలుగు రాష్ట్రాలలో గోశాలల అభివృద్ధి కోసం ఆర్థికసాయం చేయడం జరుగుతోంది.
– వేదాలలో గోవు తర్వాత వ్యవసాయానికి ప్రాముఖ్యత ఉన్నందున నాణ్యమైన ప్రసాదాలను స్వామివారికి నివేదించి శ్రీవారి భక్తులకు పంచడంతో బాటు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తూ వారి ఉత్పత్తులను సేకరించడం జరుగుతోంది.
2. టిటిడి చేస్తున్న హిందూ ధర్మప్రచారం ఏమిటి.
– కరోనా వైరస్ నశించి ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ లోకకల్యాణం కోసం రెండున్నరేళ్లుగా నిరంతరాయంగా టిటిడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో భక్తులకు స్వామివారిని మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో టిటిడి ఖర్చులతో వారిని తిరుమలకు తీసుకొచ్చి ఉచితంగా వసతి, ఆహారం అందించి స్వామివారి దర్శనం చేయించి పంపుతోంది.
– కరోనా విపత్తు తరువాత మొదటిసారిగా నెల్లూరులో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడం జరిగింది.
– రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా హిందూ ధర్మప్రచారం చేయడానికి శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది.
టిటిడి గోసంరక్షణతోపాటు ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, శ్రీ రాధామనోహర్ దాస్ దురుద్దేశపూర్వకంగా టిటిడిని విమర్శిస్తున్నారని, ఇలాంటి వారి మాటలను నమ్మవద్దని భక్తులను టిటిడి కోరుతోంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.