RAMANUJACHARYA AVATARA MAHOTSAVAM COMMENCE _ శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం
Tirupati, 23 April 2023: The 1008th Avatara Mahotsavams of the great Sri Vaishnava Saint Sri Ramanujacharya commenced on a grand religious note in Tirupati on Sunday evening.
HH Sri Chinna Jeeyar Swamy of Tirumala in his Anugraha Bhashanam on the occasion held at Annamacharya Kalamandiram said Sri Ramanuja was the incarnation of Adisesha- the serpent king.
Later Prof. Rajagopalan delivered on Sri Ramanuja Vaibhavam.
Alwar Divya Prabandha Project AEO Sri Ramulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023 ఏప్రిల్ 23: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యులవారి అవతార మహోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మంగళాశాసనాలు అందించారు. ఆదిశేషుని అవతారమైన భగవద్ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని అయన తెలిపారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. రామానుజార్యుల అవతార మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించడం సంతోషకరమని చెప్పారు.
అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య రాజగోపాలన్ “శ్రీ రామానుజ వైభవం” పై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రేవతి బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఏఈఓ శ్రీ శ్రీ రాములు, కో-ఆర్డినేటర్
శ్రీ పురుషోత్తం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.