శ్రీ వేంకటేశ్వర వికలాంగుల పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశానికి ఆగస్టు 25న ఇంటర్వ్యూలు

తిరుపతి, 2012 ఆగస్టు 22: తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వికలాంగుల పాలిటెక్నిక్‌ కళాశాలలో 2012-13వ విద్యాసంవత్సరంలో ప్రవేశానికి గాను అర్హులైన వికలాంగ విద్యార్థులకు ఆగస్టు 25వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

3 సంవత్సరాల కాలవ్యవధి గల డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ & కమర్షియల్‌ ప్రాక్టీస్‌ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఈ కోర్సుల్లో అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ప్రవేశము లేదు.

విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో శనివారం ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వికలాంగుల పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు కోర్సు శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం, వసతి, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించబడును. వివరాల కోసం 0877-2264451, 9010222156 నంబర్లలో కార్యాలయం పనివేళల్లో సంప్రదించవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.