MAHASAMPROKSHANA BEGINS AT KARVETINAGARAM TEMPLE _ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
Tirupati, 23 August 2021: TTD commenced the Mahasamprokshanam programs at Sri Venugopala Swami temple in Karvetinagaram on Monday in Ekantha due to Covid restrictions.
The unique Vedic program will conclude on August 27 with Maha Purnahuti, Vimana Samprokshana and Gopura Samprokshana rituals.
The Vaidika programs began at the Yagashala in the morning and the Agni Pratista, Kumbha Sthapana will be observed in the evening. Similarly, Vaidika programs will continue daily till August 26. On August 27 Kalyanotsavam will be performed to Swami and Ammavaru followed by a grand procession in the temple.
Special grade DyEO Smt Parvati, Agama Advisor Dr Vedanta Vishnu Bhattacharya, Superintendent Sri Ramesh, temple inspector Sri Kumar were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
తిరుపతి, 2021 ఆగస్టు 23: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆగస్టు 27న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహూతి, విమాన సంప్రోక్షణ, గోపుర సంప్రోక్షణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకుయాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన జరుగనుంది. అదేవిధంగా ఆగస్టు 24, 25, 26వ తేదీల్లో ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకుయాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 27న సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్య, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ కుమార్ పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.