POSTERS RELEASED _ శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

TIRUPATI, 19 APRIL 2023: The posters pertaining to the annual brahmotsavams of Sri  Veda Narayana Swamy at Nagulapuram was released on Wednesday.

TTD JEO Sri Veerabrahmam released the related posters at his Chambers in TTD Administrative Building in Tirupati.

Speaking on the occasion he said the annual fete commences with Dhwajarohanam on May 4 and concludes on May 12 with Garuda Seva on May 8 and Rathotsavam on May 11.

Temple DyEO Smt Nagaratna and other staff were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
 
ఏప్రిల్‌  19,  తిరుపతి 2023: నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల  పోస్టర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
     
ఈ సందర్భంగా జేఈవో  మాట్లాడుతూ, శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.  మే 4వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న గరుడసేవ, మే 11న రథోత్సవం, మే 12న ఉదయం  చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. 
 
ఈ కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.