శ్వేతలో తితిదే పాఠశాల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు

శ్వేతలో తితిదే పాఠశాల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు

తిరుపతి, ఫిబ్రవరి 27, 2013 : తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం తితిదే పాఠశాల విద్యార్థులకు క్విజ్‌ ఫైనల్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో శ్రీ కోదండరామ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలోనూ, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండో స్థానంలోనూ నిలిచారు.
 
తితిదే పాఠశాల విద్యార్థుల్లో హిందూ సనాతన ధర్మంపై అవగాహన, నైతిక విలువలు పెంచేందుకు ఏడాది క్రితం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ”సదాచారం” పేరిట శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు ముగింపు థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరగతుల్లో విద్యార్థులు నేర్చుకున్న విషయాలపై ఫిబ్రవరి 21వ తేదీన మొత్తం ఏడు తితిదే పాఠశాలల్లో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో గెలుపొందిన  మొత్తం 7 జట్లను ఫైనల్‌ పోటీలకు ఎంపిక చేశారు. ఫైనల్‌ క్విజ్‌ పోటీల్లో శ్రీ కోదండరామ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలోనూ, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండో స్థానంలోనూ నిలిచారు. గెలుపొందిన విద్యార్థులకు మార్చి నెలలో మహతి కళాక్షేత్రంలో జరుగనున్న ”సదాచారం” విజయోత్సవ సభలో బహుమతులు అందజేయనున్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌, పూర్వ కార్యదర్శి శ్రీ చెంచుసుబ్బయ్య, కో-ఆర్డినేటర్‌ శ్రీ చెన్నకేశవులు నాయుడు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.