సంతాప సందేశం

సంతాప సందేశం

తిరుపతి, 2010 జూన్‌ 19: తిరుమల తిరుపతి దేవస్థానములో ప్రజాసంబంధాల అధికారిగా సుధీర్ఘకాలం భక్తులకు సేవలందించిన డాక్టర్‌ రావుల సూర్యనారాయణ మూర్తి శనివారం ఉదయం రాజమండ్రిలో స్వర్గస్తులైన్నారు.

ఈ సందర్భంగా వారి మృతి తితిదేకు తీరని లోటు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానిభూతిని తితిదే కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ రావుల సూర్యనారాయణ మూర్తి ప్రభుత్వ సమాచార శాఖ నుండి డిప్యూటేషన్‌ మీద 26-05-1978 సంవత్సరంలో తితిదేకు ప్రజాసంబంధాల అధికారిగా విచ్చేసి సుమారు 15 ఏళ్ళపాటు తితిదేలో పనిచేశారు. ఇక్కడే పదవీ విరమణ పొందారు. అనంతరం రెండేళ్ళపాటు శ్రీ వేంకటేశ్వర కేంద్ర గ్రంధాలయం, పరిశోధనాకేంద్రం సలహాదారుగా పనిచేశారు. అక్కడ అనేక ఇతర శాఖలతోపాటు ముద్రణాలయం ప్రచురణల విభాగం అధిపతిగా, తిరుమల తిరుపతి దేవస్థానం సవ్యాఖ్యాన కవిత్రయ భారతం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన రావుల రామాయణం, పద్మావతి శ్రీనివాసం (పద్యకావ్యాలు) గ్రంధాలు ప్రజాదరణపొందాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.