FOLLOW TRADITION TO STAY PROSPEROUS- SCHOLAR _ సంప్రదాయాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం : ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి

TIRUPATI, 04 JULY 2023: On the penultimate day of Chaturveda Havanam in the TTD Parade Grounds, renowned Vedic scholar Sri Prava Ramakrishna Somayaji said if traditional values are followed the grace of Goddess Lakshmi will be showered on humanity.

 

On Tuesday evening he delivered discourse on Rig Vedam-Lakshmi Kataksham.

Later Sri Astalakshmi Vaibhavam dance ballet presented by students of SV College of Music and Dance choreographed by the Principal Dr Uma Muddubala allured the audience.

 

JEO for Health and Education Smt Sada Bhargavi, HDPP Incharge Programming Officer Smt Prasanthi, SVIHVS Special Officer Dr Vibhishana Sharma were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంప్రదాయాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం : ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి

– ఆకట్టుకున్న శ్రీ అష్టలక్ష్మీ వైభవం నృత్యం

తిరుపతి, 2023, జూలై 04: సనాతన హిందూ ధర్మంలో ఉన్న సంప్రదాయాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ప్రవా రామకృష్ణ సోమయాజి పేర్కొన్నారు. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది.

రాత్రి 7 గంటలకు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి “ఋగ్వేదం – లక్ష్మీ కటాక్షం” అనే అంశంపై ఉపన్యసించారు. ఋగ్వేదంలో లక్ష్మీ సూక్తం ఉందని, ఇది లక్ష్మీతత్వాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఇతర దేవతలను ఉపాసన చేయాలంటే ఆయా వేద మంత్రాలను పఠించాలన్నారు. లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేయాలంటే చక్కటి కట్టుబొట్టుతో సంప్రదాయబద్దంగా ఉంటే చాలని లక్ష్మీ సూక్తం ద్వారా తెలుస్తోందన్నారు. శ్రీసూక్తంలోనూ అమ్మవారికి సంబంధించిన విశేషాలను తెలియజేశారని, ప్రతి ఒక్కరూ శుభాలు కలగాలని కోరుకుంటూ పేరు ముందు శ్రీ శబ్దాన్ని ఉచ్ఛరిస్తారని తెలియజేశారు.

కాగా, వేదపండితులు ఉదయం చతుర్వేద హవనం, మధ్యాహ్నం చతుర్వేద పారాయణం నిర్వహించారు.

ఆకట్టుకున్న సంగీత, నృత్య కార్యక్రమాలు

సాయంత్రం జరిగిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎం.అనంతకృష్ణ వేణువు, డా.కె.వి కృష్ణ వయోలిన్, శ్రీ యం.సుధాకర్ మృదంగం, శ్రీ రఘురాం ఘటం, శ్రీ వైయల్.శ్రీనివాసులు డోలు, శ్రీ నవీన్ తాళం తదితర వాద్యాలతో జుగల్ బందీ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీమతి పి.శైలజ బృందం సంగీత కచేరీ జరిగింది. ఇందులో పలు అన్నమయ్య కీర్తనలను చక్కగా ఆలపించారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి యం.ఉమా ముద్దుబాల బృందం “శ్రీ అష్టలక్ష్మీ వైభవం” నృత్యరూపకాన్ని చక్కగా పద్రర్శించారు.

ఈ కార్యక్రమాల్లో టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి, హిందూ ధర్మప్రచార పరిషత్ ఇన్ఛార్జి ప్రోగ్రామింగ్ అధికారి శ్రీమతి ప్రశాంతి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.