TTD CHAIRMAN INSPECTS VAIKUNTHAM _ సర్వదర్శనం భక్తుల వసతులను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

Tirumala, 02 September 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy inspected the facilities being provided by TTD for Sarvadarshanam devotees at Vaikuntham Q Complex-2 on Saturday night. 

He inquired whether the food, drinking water, coffee and tea provided to the common devotees are being served on time or not.

The staff were instructed to serve enough Annaprasadam for the waiting devotees.  He also enquired how long its taking for darshan.

The officers explained to the Chairman that devotees without tokens have been sent for darshan from 47 compartments since morning and it’s taking nearly 14 hours for darshan.

Earlier, the Chairman entered the Vaikuntam-2 Q complex like a common devotee and also underwent security checking.

DyEO Sri Lokanatham, AVSO Vaikuntham Sri Vishwanath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వదర్శనం భక్తుల వసతులను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల, 2023 సెప్టెంబరు 02: టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి శనివారం రాత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో సర్వదర్శనం భక్తుల కోసం టీటీడీ కల్పించిన వసతులను పరిశీలించారు. సామాన్య భక్తులకు అందుతున్న అన్నప్రసాదం, తాగునీరు, కాఫీ, టీ వంటివి సకాలంలో అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం భక్తులకు సరిపోయేంతగా పెట్టాలని సిబ్బందికి సూచించారు. క్యూ కాంప్లెక్స్ లోకి ఎన్ని గంటలకు ప్రవేశించారు, దర్శనానికి ఎంత సమయం పడుతోందన్న విషయాలను భక్తుల నుండి తెలుసుకున్నారు. ఉదయం నుండి ఇప్పటివరకు 47 కంపార్ట్మెంట్ల నుంచి టోకెన్ లేని భక్తులను దర్శనానికి పంపామని, దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని ఛైర్మన్ కు విజిలెన్స్ అధికారులు వివరించారు.

అంతకుముందు సామాన్య భక్తుడి తరహాలో వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ లోకి ఛైర్మన్ ప్రవేశించారు. మెటల్ డిటెక్టెర్ ద్వారా స్వయంగా తనుఖీలు చేయించుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.