RADHARANGA DOLOTSAVAM WITNESSED THROUGH SARVABHOOPALA VAHANAM _ సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప

Tirumala, 26 Sep. 20: The mighty wooden chariot procession has been witnessed in the form of Sarvabhoopala Vahanam with lord Malayappa and His consorts seated elegantly to bless devotees.

On the penultimate day of annual brahmotsavams on Saturday, Lord and Goddesses were mounted on finely decorated Sarvabhoopala Vahanam.

In view of COVID 19 restrictions, TTD observed both the golden and wooden chariots with Sarvabhoopala Vahanam.

The event took place in Kalyanotsava Mandapam between 7am and 8am.

TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, board members and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

tent

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 26: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శ‌ని‌వారం ఉద‌యం 7.00 గంట‌లకు ‌రథోత్స‌వం బదులుగా శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

ఈ వాహ‌న‌సేవ‌లో టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ డిపి అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.