GOVINDARAJA RIDES SIMHA VAHANA _ సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

TIRUPATI, 18 MAY 2024: Sri Govindaraja Swamy took out a celestial ride on the fierceful Simha Vahanam on Saturday.

The third day ongoing the annual brahmotsavam in Sri Govindaraja Swamy temple at Tirupati witnessed the processional deity taking ride on the powerful Lion carrier to bless His devotees.

Lead by caparisoned elephants, horses, dancing troupes in a colourful way, the deity atop Simha Vahanam marched ahead along the mada streets.

Both the senior and junior pontiffs of Tirumala, Agama advisors Sri Seetaramacharyulu, Sri Mohana Rangacharyulu, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

తిరుపతి, 2024 మే 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం అనంతతేజోమూర్తి  శ్రీ గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. స్వామివారు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది.

అనంతరం ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.